calender_icon.png 7 November, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంకుటిల్లు నేలమట్టం

06-11-2025 10:38:42 PM

తప్పిన ప్రమాదం..

నిర్లక్ష్యంగా రెవెన్యూ అధికారుల తీరు..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోనీ కొండయి గ్రామంలో అంబాల భక్కమ్మ. పుల్లయ్య దంపతుల పెంకుటిల్లు ప్రమాదవశాత్తు గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి గత కొంతకాలంగా కురిసిన వర్షాల కారణంగా  వర్షాలకు పలు ఇల్లు గోడలు తడిచి పోవడం జరిగింది. భూరుద నీరు చేరి నిమ్ము చేరి. ఉదయం ఒకసారిగా పెంకుటిల్లు కూలిపోయింది జరిగిన సమయంలో దంపతులు ఇద్దరు ఆరు బయట ఇంటి పనులు చేసుకుంటూ ఉండటం వల్ల ప్రాణ ప్రాయం తప్పింది. ఇంట్లో బీరువా సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయిందినీ బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

స్థానిక సంఘటన స్థలానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ చేరుకొని వివరాలు సేకరించి ఉన్నత అధికారులకు సమాచారం అందజేశారు. స్థానికంగా అందుబాటులో లేని రెవెన్యూ అధికారులు గ్రామ పరిపాలన అధికారి(జిపిఓ) గ్రామస్తులు ఎవరూ కూడా తమకి సమాచారం అందివ్వలేదు. మేము అక్కడికి వెళ్లలేదు అనే నిర్లక్ష్యం సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిన స్థానిక రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ ద్వారా పెంకుటిల్లు కూలిన బాధితులను స్థానిక రెవెన్యూ కార్యాలయం పిలిపించుకొని ఆర్ధిక సహాయం అందించినట్లు బాధితులు తెలిపారు. 

గతంలో కురిసిన వర్షాల కారణంగా. పలు ఇండ్లు తడిసి ఇళ్ళలోకి వరద నీరు చేరి ఎప్పుడూ కూలిపోవడం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితి నెలకొంది అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో సర్వ చేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేసి ఆదుకోవాలినీ గ్రామస్తులు కోరుతున్నారు. ఇండ్లు కూలిన బాధిత కుటుంబంకి నష్టపరిహారం చెల్లించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దళిత కుటుంబానికి చెందిన పెంకుటిల్లు ప్రమాదవశాత్తు కూలిపోవడంతో రెవెన్యూ అధికారులు కనీసం సందర్శించలేదని. ఇల్లు నేలమట్టమై సర్వం కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న బాదిత కుటుంబాన్ని ఏటూర్ నాగారం కార్యాలయానికి పిలిపించుకొని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు