calender_icon.png 7 November, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ను కలిసిన ములుగు జర్నలిస్టులు

06-11-2025 10:24:45 PM

ములుగు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాదులో గురువారం ములుగు జర్నలిస్టులు, ఐ.జే.యూ ములుగు జిల్లా అధ్యక్షులు షఫీ హమ్మద్, ఉపాధ్యక్షులు బేతి సతీష్ యాదవ్ కార్యదర్శి చిదిరాల వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ములుగు జిల్లా జర్నలిస్టుల స్థితిగతులు, పరిస్థితులను ప్రెస్ అకాడమీ చైర్మన్ కు వివరించారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని పొద్దుటూరులో గల ప్రగతి రిసార్ట్ లో జరిగిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ.జే.యూ) రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని ములుగు జిల్లాలో ఐజేయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వారు ఈ సమావేశంలో వివరించారు.

అదేవిధంగా ఐజేయూ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో చేపట్టిన సభ్యత నమోదు పుస్తకాలను రాష్ట్రస్థాయి బాధ్యులకు ఈ సమావేశంలో అందించడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సభ్యత్వాలు పూర్తి చేసినందుకుగాను రాష్ట్ర నాయకత్వం ములుగు జిల్లా ఐ జే యూ నాయకులను అభినందించారు. అంతేకాకుండా ములుగు జిల్లా ఐ జే యూ నాయకులు షఫీ,సతీష్,వాసు లు ఇటీవల హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన రాజేష్ యాదవ్ ను సైతం కలిసి శుభాకాంక్షలు తెలియడంతో పాటు శాలువాలతో సన్మానించి అభినందించారు. అదేవిధంగా ఐ జే యూ జాతీయ నాయకులు,సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ని సైతం మర్యాదపూర్వకంగా కలిసారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.