06-11-2025 10:40:47 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిలువేరు రవితేజ(29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బెల్లంపల్లి రేషన్ రోడ్ మార్గమధ్యలో గుర్తుతెలియని రాయల్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహ విషయంలో కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపాని గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడు పట్టణంలోని కన్నాల బస్తి నివాసి అని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు జీ అర్ పీ కానిస్టేబుల్ సంపత్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.