29-11-2025 12:23:41 AM
మహబూబాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఎస్ జీ ఎఫ్ రగ్బీ పోటీలకు మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం పెనుగొండ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థి సాయి చరణ్ ఎంపికైనట్లు హెడ్మాస్టర్, మండల విద్యాధికారి కాలేరు యాదగిరి తెలిపారు. డోర్నకల్ బిషప్ గ్రౌండ్ లో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సాయి చరణ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు.
నేటినుండి డిసెంబర్ ఒకటి వరకు మహబూబాబాద్ జిల్లాలో జరుగు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో సాయి చరణ్ పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సాయి చరణ్ ను ఫిజికల్ డైరెక్టర్ విజయ్ చందర్, ఉపాద్యా యులు అంజయ్య, గురునాధరావు, హుస్సే న్, వెంకటగిరి, భాస్కర్, శ్రీవాసరావు, రవికుమార్ కిషన్, భీముడు, వీరేందర్, భాగ్యలక్ష్మి అభినందించారు.