01-09-2025 07:04:02 PM
వనపర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్ టీచర్స్ గా అంగన్వాడీ టీచర్స్ ను తీసుకోవాలని, అదనపు పనులను కేటాయించకూడదని ఆయా పోస్టులను భర్తీ చేయాలని సోమవారం హైదరాబాదులో కమిషనర్ సృజన(Commissioner Srujana)ను అన్ని ఎన్ జి ఓ ఎస్ జిల్లాల లీడర్లు కలిసి కోరారు. అలాగే స్మార్ట్ ఫోన్లు 5జి ఇవ్వాలని కోరగా 15 రోజులలో ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన యూనిఫామ్స్ బాగాలేవని చెప్పారు. ఇంటి అద్దెలు గ్యాస్ బిల్లులు కూరగాయల బిల్లుల విషయంలో కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళమన్నారు. అదనపు పనుల భారం నుండి మినహాయించడం వల్ల ప్రీ స్కూల్ మేము పర్ఫెక్ట్ గా చెప్తామని హామీ ఇవ్వగా దానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ జి ఓ ఎస్ అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు G పద్మ, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీ వాణి, తదితరులు పాల్గొన్నారు.