25-11-2025 05:38:24 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఆరూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈజీఎస్ నిధులు 26 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం, 12 లక్షలతో అంగన్ వాడి భవనము నిర్మాణం, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 15 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణం, నిధులు 14.5 లక్షలతో కల్వర్టు, డ్రైనేజీ నిర్మాణం, 12 లక్షలతో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణమునకు, డీఎఫ్ఎంటి నిధులు 4 లక్షలతో పలు అభివృధి పనులకు ప్రారంభోత్సవం జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.