calender_icon.png 25 November, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా

25-11-2025 05:55:46 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు నల్లగొండ కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను రైతులు, కార్మికులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాల ప్రమీల కోరారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను, అమలు చేస్తున్న విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రైతులు కూలీలు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వంటేపాక వెంకటేశ్వర్లు, ఆదిమల్ల సుధీర్, రైతు సంఘం నాయకులు గింజల లక్ష్మి స్వరూప ,వ్య.కా.సా నాయకులు సాకుంట్ల నరసింహ, తాజేశ్వర్, కృష్ణ, శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.