25-11-2025 05:57:00 PM
సిద్దిపేట క్రైం: ఈ నెల 27న ఉదయం 10 గంటలకు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ప్రజాకవి అందెశ్రీ సంతాప సభ నిర్వహించనున్నట్లు నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీ అధ్యక్షుడు పిన్నింటి దాసు తెలిపారు. నిరుద్యోగ కళాకారుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభకు జిల్లాలోని కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. తెలంగాణ సమాజానికి అందెశ్రీ ఇచ్చిన కీర్తి, పాటలను గుర్తు చేసుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.