calender_icon.png 25 November, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రాల్లో కాంటాలు త్వరితగతిన నిర్వహించాలి

25-11-2025 05:50:55 PM

తహసీల్దార్ శ్రీకాంత్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటాలు త్వరితగతిన నిర్వహించాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండలంలోని పర్సాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించి, రైతులు తేమ లేకుండా తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు నిర్వహించి మిల్లులకు ఎగుమతి చేయాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో కేంద్రాల నిర్వాహకులు,రైతులు ఉన్నారు.