calender_icon.png 22 July, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడు ఆరోగ్యాన్ని మరవొద్దు!

22-07-2025 12:14:58 AM

కేర్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కైలాస్ మిర్చే 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): శరీరాన్ని నియంత్రించే అత్యం త ముఖ్యమైన అవయవం మెదడు. మెదడు ఆరోగ్యాన్ని ఎప్పటికీ మరువొద్దని కేర్ హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కైలాస్ మిర్చే తెలిపారు. మంగళవారం వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా సోమవారం ఆయ న మెదడు సంబంధిత సమస్యల గురించి వివరించారు.

“ప్రారంభ దశలోనే గుర్తింపు, తగిన చికిత్స, మెదడు ఆరోగ్యాన్ని నిలబెట్టే జీవనశైలిపై దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. స్ట్రోక్, ఎపిలెప్సీ, డిమెన్షి యా, మల్టిపుల్ స్క్లిరోసిస్, మెదడు క్యాన్సర్ వంటి వ్యాధులు ఇప్పుడు యువతను, వృద్ధులను ఒకేలా ప్రభావితం చేస్తున్నాయి. దీని వెనుక ప్రధానంగా పెరిగిన ఒత్తిడి, కూర్చునే జీవనశైలి, అవగాహన లోపమే ఉన్నాయి. 30 ఏళ్లలోపువారిలోనూ మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

సాధారణంగా మెదడుకు మేలు చేసే అలవాట్లలో ప్రతి రోజు 78 గంటల నాణ్యమైన నిద్రపోవడం, బీ-విటమిన్లు, ఓమెగా-3 ఫ్యాటీ యాసి డ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యమైనవి. చిన్నపిల్లల స్క్రీన్ టైం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాథమిక దశలోనే మెదడు అభివృద్ధి జరుగుతుంది. ఈ దశలో స్క్రీన్ ఎక్కు వగా చూసినట్లయితే, పిల్లల్లో భావోద్వేగ నియంత్రణ, దృష్టి వ్యవధి,

మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మెదడుకు మంచి ఆహారం తీసుకోవాలి. న్యూరో సైన్స్ విభాగంలో అత్యా ధునిక సదుపాయాలు, స్ట్రోక్ రెస్పాన్స్ టీమ్లు, ఎపిలెప్సీ మానిటరింగ్, న్యూరో రిహాబిలిటేషన్, నిపుణులచే నిర్వహించబడే శస్త్రచికిత్సలతో కేర్ హాస్పిటల్స్ ముందుంది” అని చెప్పారు.