calender_icon.png 9 May, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రయోగం వర్కౌట్ కాకపోతే కొత్త ప్రయత్నం మానొద్దు

08-05-2025 12:56:24 AM

శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజాచిత్రం ‘సింగిల్’. కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతాఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్ప కుడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. మే 9న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకుడు శ్రీవిష్ణు విలేకరులతో పంచుకున్నారు.

-“మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలని తీసిన సినిమా ఇది. అన్ని సన్నివేశాలు మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ఒక క్యారెక్టర్‌కు మరో క్యారెక్టర్‌కు ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యే ప్రాసెస్‌లో డైరెక్టర్‌తోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఆ ప్రయాణంలోనే 50 శా తం వచ్చేస్తుంది. లొకేషన్‌లో ఇంకొంత కమాండ్ పెరుగుతుంది. యంగ్‌స్టర్స్ నా డైలాగ్ డిక్షన్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్లకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా.

-నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవు తోంది. రానున్న రోజుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. పెద్ద రెవల్యూషన్ రాబోతోంది. నెక్స్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పునకు నేను సిద్ధంగా ఉన్నా. ‘స్వాగ్’ ఒక ఫుల్ కామెడీ సినిమా అనుకున్నాం.

కానీ చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ప్రయో గం చేసినప్పుడు వర్కౌట్ కాకపోతే అదొక అనుభవంగా చూడాలి. కొత్త ప్రయత్నం మాత్రం మానొద్దనే ది నా అభిప్రాయం. ఇంకా నేను ‘మృత్యుంజయ’ అనే ఒక థ్రిల్లర్ చేస్తున్నా. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా చేస్తున్నా” అని చెప్పారు.