09-05-2025 10:54:15 PM
మరి కొంతమంది భద్రాచలం వాసులు
కేటీఆర్ సమక్షంలో చేరిక
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణానికి చెందిన విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ తోటమల్ల బాలయోగి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు భద్రాచలానికి చెందిన కుంచాల సదానందం, వ్యాపారవేత్త బచ్చు శ్రీనివాస్, శ్రీరంగం భార్గవ్, కొనకల్ల వేణుగోపాల్, న్యాయవాదులు రామాంస, మల్ల సత్యనారాయణలతో పాటు మొత్తం 20 మంది సత్తుపల్లి నియోజకవర్గం మిట్టపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రావులపల్లి రాంప్రసాద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...మేధావి వర్గం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని, రానున్నది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ పురోగతికి ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని సూచించారు. భద్రాచలంలో ఉప ఎన్నికలు రావడం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు, టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు,మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, బిఆర్ఎస్ డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ,బి.ఆర్.ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు