calender_icon.png 12 September, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి

12-09-2025 06:42:32 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ లో అర్హులైన బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా పింఛన్లు అందించాలని కోరుతూ సిఐటియు బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.