12-09-2025 06:39:50 PM
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ నెల 15 న కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష సందర్భంగా ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పించేందుకు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు .వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.