calender_icon.png 19 November, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల బారినపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు

19-11-2025 12:00:00 AM

ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి క్రైమ్, నవంబర్ 18 : దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు.నషాముక్త్ భారత్ అభియాన్ (మిషన్ పరివర్తన) కార్యక్రమంలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు  అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ  దేశమైన అభివృద్ధి సాధించాలంటే అందులో యువ త ప్రధాన భూమిక ఉంటుందని, అలాంటిది ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన  దేశం మన భారత దేశమని చెప్పారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన యువతలో కొంతమంది  తప్పుడు స్నేహం, దురలవాట్ల వల్ల మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను చేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా తమ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికైన యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా  సరైన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. సుధారాణి, వనపర్తి సిఐ, ఎస్త్స్ర,  సీడీపీఓలు సూపర్వైజర్లు, ఐసిపిఎస్ సిబ్బంది, మెడికల విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రగ్స్ వినియోగం సమాజానికి చేటు

నాగర్ కర్నూల్ నవంబర్ 18 (విజయక్రాంతి): డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి భారీగా ముప్పు వాటిల్లుతుందని  జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన నషా ముక్తి భారత్ అభియాన్ ఐదేళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని, మత్తుబారిన పడిన వారిని డీఅడిక్షన్ సెంటర్కు పంపాలని సూచించారు. గ్రామీణ సంస్థలు, పంచాయతీలు డ్రగ్స్ నిర్మూలనపై తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. 

కల్వకుర్తి నవంబర్ 18: మాదకద్రవ్యాలకు బానిసలై జీవితాలను బుగ్గి పాలు చేసుకోవద్దని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ పేర్కొన్నారు. మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా పట్టణంలోని వైఆర్‌ఎం కళాశాలలో  నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. యువత దేశ భవిష్యత్తని, వారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే సమాజం సురక్షితంగా, శ్రేయస్సుతో ముందుకు సాగుతుందని అన్నారు.

విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు కలిసి డ్రగ్స్ వ్యసన నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల స్థాయిలో సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కళాశాల ఆధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.