calender_icon.png 4 November, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొబ్బరి నీళ్లను అమ్మొద్దు

04-11-2025 12:00:00 AM

-భద్రకాళి అమ్మవారికి అభిషేకం చేయాలి

-భారతీయ హిందూ పరిషత్, అంతర్జాతీయ సంస్థ గోరక్షా దళ్ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కొబ్బరికాయ కొట్టిన నీళ్లను ప్లాస్టిక్ బాటిల్లో నిం పి, భక్తులకు అమ్మడం నిషేధించి, ఆ కొబ్బరి నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేయాలని భారతీయ హిందూ పరిషత్, అంతర్జాతీయ సంస్థ గో రక్షా దళ్ రాష్ట్ర అధ్యక్షు డు స్థూల శివరామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిష నర్‌కు లేఖను రాశారు.

భద్రకాళీ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా శేషుభారతి ఉన్న సమయంలో అనేక సార్లు ఫిర్యాదు చేయగా కొబ్బరి నీళ్లు అమ్మకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. శేషు భారతి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త అసిస్టెంట్ కమిషనర్‌కు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదులు వెళ్లడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. గతంలో కొబ్బరినీళ్ళ విషయమై అనేకసార్లు మీడియా ముందుకు వెళ్లి ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.

అప్పుడు ఉన్న కాంట్రాక్టర్ చాటుగా అమ్మినప్పుడు గొడవ చేసిన వాళ్లు.. ఇప్పుడు అదే కాంట్రాక్టర్ డైరెక్టుగా బాటిళ్లు పెట్టి అమ్ముతుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. భక్తులు కొబ్బరికాయ కొట్టడాన్ని నిరాకరిస్తూ, సద రు టెండర్ వ్యక్తి భక్తుల దగ్గర నుంచి కొబ్బరికాయ తీసుకొని తనే కొట్టడంలో అం తర్యం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. భక్తులు స్వయంగా కొబ్బరికాయ కొట్టడాన్ని ఈ దేవాలయ పెద్దలు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.

అప్పుడు టెండర్ పాడిన రమేష్ అనే వ్యక్తితో కొబ్బరినీళ్లు అమ్మకూడదని అనేకసార్లు గొడవలకు దిగిన వాళ్లు ఈరోజు ఎందుకు అతనిపై నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చాలా సంవత్సరాలుగా ఇతనికే టెండర్ ఇస్తున్నారు. అతనికి దేవస్థానం వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. భక్తులకు కొబ్బరి కాయలు కొట్టే అవకాశం కల్పించాలని, కొబ్బరి నీళ్ళను అమ్మకూడదని, కొబ్బరి నీటితో అమ్మవారికి అభిషేకం చేయాలని కోరారు.