09-05-2025 03:44:09 AM
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): పంజాబ్‌లోని ఫిరోజ్‌ఫూర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ జాతీయుడిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) బుధవారం అర్ధరాత్రి కాల్చివేసింది. చొరబాటుదారుడు ఐబీని దాటి చీకట్లో సరిహద్దు భద్ర తా కంచెవైపు కదులుతున్నట్లు బీఎస్‌ఎఫ్ జవాన్లు గమనించారు. ఇటు రావొద్దంటూ బీఎస్‌ఎఫ్ దళాలు హెచ్చరించినప్పటికీ.. ఆ వ్యక్తి ముందుకుసాగుతూనే సవాల్ చేశాడు.
దీంతో సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరిపి హతమర్చారు. అతడి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. అతడి దగ్గర పాకిస్థాన్‌లో తయారైన వ్యవసాయ రసాయనాలను స్వాధీనం చేసుకున్నా రు. కాగా, రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పంజాబ్ ప్రభుత్వం సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది.