calender_icon.png 10 September, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచుతాం

09-09-2025 01:18:03 AM

  1. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లతాం 
  2. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్  

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యక్రమాలను కాంగ్రెస్ తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ కుట్రలను ప్రజల్లో ఎండగడుతామని మంత్రి పొన్నం హెచ్చరించారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశం తర్వాత గాంధీభవన్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్‌రెడ్డితో కలిసి  మంత్రి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్  మీడియాతో మాట్లాడా రు.

కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఇప్పు డు కేసీఆర్ కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాన్ని కూడా ప్రజల్లో తీసుకుపోతామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న జనహిత పాదయాత్రను త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి పొన్నం చెప్పారు. ఎరువుల సరఫరాపై బీజేపీ బాధ్యత వహించేలా ప్రజల నుంచి ఒత్తిడి తెచ్చేలా కార్యక్ర మాలు ఉంటాయన్నారు. గోదావరి ఫేజ్ 1, కృష్ణా, మంజీర నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.