04-07-2025 01:48:47 AM
బాధితులకు ధైర్యం చెప్పిన డాక్టర్ కోట నీలిమ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3: సనత్‌నగర్‌లో ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించి ఇంట్లోని ఫర్నీచర్, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి.
ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో ముప్పు తప్పింది. విషయం తెలుసుకున్న సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అదృష్టవ-శాత్తు ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. కానీ, ఇంట్లోని సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైందని తెలిపారు. ఆందోళన వద్దని.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.