calender_icon.png 4 July, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ భూమయ్య, సంగిశెట్టి శ్రీనివాస్‌కు సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం

26-05-2025 12:00:00 AM

ఈ ఏడాది సురవరం ప్రతాపరెడ్డి పురస్కారానికి సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత, పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 28న సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని ‘సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం’లో ట్రస్ట్ పురస్కా ర గ్రహీతలకు అవార్డులు ప్రదానం చేయనున్నది.

కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మం త్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, విశిష్ట అతిథిగా శాంతా వసంతా ట్రస్ట్ వ్యవస్థాపకుడు వరప్రసాదరెడ్డి హాజరుకానున్నారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు ఆచా ర్య ఎల్లూరి శివారెడ్డి సభాధ్యక్షత, నిర్వాహకుడిగా డాక్టర్ జే చెన్నయ్య వ్యవహరించను న్నారు. కార్యక్రమానికి సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో విచ్చేయా లని ట్రస్ట్ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.