calender_icon.png 6 September, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికహక్కులను రక్షిస్తేనే కొమురయ్యకు మనమిచ్చే ఘననివాళి

06-09-2025 12:30:43 AM

- వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

- కొత్తగూడెంలో ఘనంగా కొమరయ్య 29వ వర్ధంతి

భద్రాద్రికొత్తగూడెం, సెప్టెంబర్ 5,( విజయక్రాంతి ):ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగా లతో సాధించుకున్నసాధించుకున్న హక్కులను రక్షించుకుంటూ, నూతన హక్కులు సాదించుకుంటేనే యూనియన్ కొమురయ్యకు మనమిచ్చే ఘన నివాళి అని, ఆ దిశగా యూనియన్ కార్యకర్తలు కార్మికుల పక్షాననిలబడి పోరాడాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, కొత్తగూడెం శాస నసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి, యూని యన్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ సా యుధ పోరాట యోధులు మనుబోతుల కొమురయ్య 29వ వర్దంతిని ఏఐటియుసి, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రు ద్రంపూర్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం యూనియన్ కొత్తగూడెం బ్రాం చి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సం దర్బంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ సింగరేణి కార్మికవర్గానికి కొ మురయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, నేడు కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక కొమురయ్య పోరాటం, త్యాగం ఉందని కొనియాడారు. సింగరేణిలో ఎనిమిది గంటల పనివిధానాన్ని సాధించిన ఘనత కొమురయ్యదేనన్నారు.   

లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పా షా, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రా జ్ కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కేంద్రకమిటీ నాయకులు జి వీరాస్వామి, వైవి రావు, జి వీరాస్వామి, వంగ వెం కట్, వి. మల్లికార్జున్, ఎస్ వి రమణమూర్తి, ఎస్ సుధాకర్, జె గట్టయ్య, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, కొమురయ్య కు టుంబ సభ్యులు పాల్గొన్నారు.