12-07-2025 12:00:00 AM
ఖమ్మం, జులై 11 (విజయ క్రాంతి): ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండెండెంట్ గా డాక్టర్ ఎం నరేందర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్ ల, ఆసుపత్రుల సూపరిండెంట్ల బదిలీల్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఎం నరేందర్ బదిలీపై వచ్చారు .
ఇంచార్జ్ సూపరిండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి డాక్టర్ ఎం నరేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీ జీ హెచ్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డా. కిరణ్ కు మార్,డా. రాంబాబు, సంతోష్, రవి కిషోర్, ఇస్లావత్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.