30-10-2025 06:35:25 PM
నకిరేకల్ (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు, నాలుగో వార్డ్ సంతోష్ నగర్, విద్యానగర్ శ్రీనివాస ఏరియా వివిధ కాలనీలలో గురువారం నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, గాజుల సుకన్య, ఇతర కౌన్సిలర్లు పర్యటించి మున్సిపల్ సిబ్బంది సహాయంతో వీధుల్లో, మురికి కాలువల్లో, సీసీ రోడ్ల వెంబడి నిలిచిపోయిన వర్షపు నీటిని దారి మళ్లించి చెత్తచెదారాన్ని తొలగించారు.