calender_icon.png 30 October, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారీ శక్తిలో పోలీసుల అవగాహన

30-10-2025 06:37:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు గురువారం నారీ శక్తి మహిళా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా పోలీసులు రోడ్లపై ద్విచక్ర వాహనాలకు రోడ్డు నిబంధనలు హెల్మెట్ లైసెన్స్ పై అవగాహన కల్పించి మహిళలకు దొంగల పట్ల అపరిచితుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన అక్రమ గంజాయి గుట్కా వంటి రవాణా రవాణా వంటి కళ్ళకు కనిపించిన 100 నెంబర్ కు వెంటనే ఫోన్ కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.