calender_icon.png 30 October, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

30-10-2025 06:33:41 PM

కమిషనర్ ప్రపుల్ దేశాయ్..

కరీంనగర్ (విజయక్రాంతి): మెుంథా తుఫాన్ వరదల పట్ల కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ప్రపుల్ దేశాయి ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థలో కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ సమక్షంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సీడీఎంఏ అధికారి శ్రీదేవి జూమ్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మెుంథా తుఫాన్ వరదల పట్ల తీస్కోవాల్సిన జాగ్రత్తలు, నగర ప్రజల రక్షణ చర్యలు, వరదల ద్వారా చెడిపోయిన రోడ్లు, డ్రైనేజీ లు, కల్వర్టులు, డివైడర్లు, మ్యాన్ హోల్ చాంబర్లు, మంచి నీటి సరఫరా పైపులైన్లు తదతర అంశాల పై అధికారులతో చర్చించారు.

అనంతరం కమీషనర్ మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా వరదల వల్ల చెడిపోయిన డ్రైనేజీ కల్వర్టులు, రోడ్లు, డ్రైనేజీలు, స్టాం వాటర్ డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ చాంబర్లు, మంచి నీటి సరఫరా పైపులైన్లతో పాటు తదితర ఏమైనా చెడిపోయి ఉంటే వాటిని గుర్తించి.. వాటి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటికి సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేసి... అంచనాల రిపోర్టును అందించాలన్నారు. త్వరలోనే వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతు పనులు చేయించి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కురుస్తున్న వర్షాలతో వచ్చే వరదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని.. నగర ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ జూమ్ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, ఏసిపిలు వేణు, శ్రీధర్ పాల్గొన్నారు.