calender_icon.png 15 November, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలందరికీ తాగునీరు అందించాలి

01-12-2024 02:13:24 AM

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు

పటాన్‌చెరు, నవంబర్ 30: బొల్లారం మున్సిపాలిటీలోని ప్రజలందరికీ తాగునీటిని అందించాలని మెదక్ ఎంపీ రఘునం దన్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ కొలను రోజారాణి బాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బొల్లారం మున్సిపాలిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశానికి ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులతో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహిం చారు. మున్సిపాలిటీలో అన్నిచోట్ల హైమాస్ట్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా మున్సిపాలిటీ పరిధిలో ముప్పు పడకల ఆసుపత్రి, ఈఎస్‌ఐ హాస్పిటల్,  సర్వేనంబర్ 81లోని ఎకరం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఫైర్ స్టేషన్, జనాభా ప్రాతిపదికన అవసరమైన అంగన్‌వాడీ కేంద్రాలను మంజూరు చేయాలని చైర్‌పర్సన్ రోజారాణి ఎంపీని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోనే ౫ఎకరాల ప్రభుత్వ భూమిని డంపింగ్ యార్డు కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు.