06-05-2025 07:12:59 PM
కూసుమంచి (విజయక్రాంతి): తనని ఆదరించి అత్యధిక భారీ మెజారిటీతో గెలపించి మంత్రిని చేసిన పాలేరు ప్రజల ఋణం తీర్చుకోవటానికి రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మరో ముందడుగు వేశారు. ఇకపై పాలేరు నియోజకవర్గంలో మృతి చెందే నిరుపేద కుటుంబాలకు అండగా పొంగులేటి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పేద ప్రజలు చనిపోతే వారి దహన సంస్కారాలకు కనీస డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన పొంగులేటి ఇకపై మృతుల కుటుంబాలకు భరోసా కల్పించాలని భావించారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తి మరణించి పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబానికి 'పొంగులేటి అండ' గా ఉంటాను అని ముందుకు రావటం నిజంగా పేద ప్రజలు అదృష్టం అని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.