calender_icon.png 7 May, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ

07-05-2025 12:01:30 AM

భద్రతా పరిస్థితి సహా సివిల్ మాక్ డ్రిల్ అంశాలపై చర్చ

న్యూఢిల్లీ, మే 6: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఐఏ) అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మో దీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మ ధ్య భేటీ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా వీరి భేటీలో తాజాగా ఉన్న భద్రతా పరిస్థితులు సహా బుధవా రం నిర్వహించనున్న సివిల్ మాక్ డ్రిల్ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అత్యవసర సమయా ల్లో ఎలా స్పందించాలనే దానిపై పౌరులను సమాయత్తం చేసేందుకు అధికారులు ఎలా సిద్ధమయ్యారన్నది చర్చించినట్టు సమాచారం.