12-01-2026 02:41:57 AM
వడ్డే ఓబన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలి
బీసీ జాక్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): వడ్డెరులకు రాజకీయంగా ప్రాతిని ధ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మైన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వడ్డెర కులం నుండి ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యే అయ్యారన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతం త్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ తో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. ఓబన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ బంధు తరహాలో వడ్డెర బంధు పేరిట 100 శాతం సబ్సిడీతో మిషనరీలను అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో ఒడ్డెరులు ప్రవేశించాలంటే ఐక్యంగా ఉండాలని జాజుల సూచిం చారు. వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే జయంతి నాటికి ట్యాంక్ బండ్ పై ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. వడ్డేరులకు ప్రభుత్వం కేటాయించిన జీవో ప్రకా రం మైనింగ్ క్వారీ, కాంట్రాక్ట్ లో 20 శాతం వడ్డేరులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, జాతీ య ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, రూపాణి లోకనాథం, గ్రేటర్ అధ్యక్షు లు బోదాసు రవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల భవాని, గ్రేటర్ అధ్యక్షురాలు మక్కల ధన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.