calender_icon.png 23 July, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తశుద్ధితోనే బీసీ ఆర్డినెన్స్ తెచ్చాం

23-07-2025 01:01:59 AM

  1. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి
  2. మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపీట 
  3. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  4. షాద్‌నగర్‌లో మహిళలకు వడ్డీలేని రుణాలు పంపిణీ

రంగారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): కుల గణనపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉన్నందునే అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామని, బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం పకడ్బందీగా అడుగు లు వేస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత పార్ల మెంట్ సమావేశంలోనే చట్ట సవరణ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకే పెద్దపీట వేయడంతోపాటు కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యమని, ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి కింద 3,418 మంది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.3.29 కోట్లు చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు విడివిడిగా కాకుండా కలిసికట్టుగా వ్యాపార రంగంలోకి వెళ్లి గడ్డిమోపులా మారాలని అప్పుడే వారి ఆర్థిక శక్తి బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామిక రంగంలోనూ, వ్యాపార రంగాలలోనూ ముందుకు తీసుకెళ్లాలని దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వెల్లడించారు.

మహిళల కోసం గోదాముల నిర్వహణ, క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, పెట్రో ల్ బంకుల నిర్వహణ లాంటి ఎన్నో కార్యక్రమాలను వ్యాపారాల రూపంలో చేసుకునేం దుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గత పాలకు లు పదేళ్ల పాలనలో విద్యను పట్టించుకోలేదు, వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారు, మహిళల కోసం ఒక్క పథకం కూడా తీసుకురా లేదని, కోట్లాది రూపాయలు అప్పులు మాత్రం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం తీసుకున్న అప్పు లకు నెలకు ఏడు కోట్ల రూపాయల చొప్పున మిత్తిలు చెల్లిస్తున్నామని ఇంత చేసిన..... మహిళలను విస్మరించలేదని గుర్తు చేశారు.

పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తాము ఈ నెల 25 నుంచే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని స్ప ష్టం చేశారు. ముఖ్యమంత్రితో కొట్లాడి అభివృద్ధి పనులను సాధించడంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముందు వరసలో ఉంటారని స్పష్టం చేశారు. మహిళల కోసం కొత్తగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చే సుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.