తాగి అంబులెన్స్ నడిపిన డ్రైవర్
03-12-2024 01:34 AM
కేసు నమోదు చేసిన పోలీసులు
నిజామాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నిజామాబాద్ నగరంలోని హైదారాబాద్ రోడ్డులో సోమావారం సాయత్రం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ప్రైవేటు అంబులెన్స్‌ను పెద్ద శబ్దంతో హారన్ మోగిస్తూ అతివేగంగా నడిపాడు. అంబులెన్స్‌లో పేషెంట్ లేకున్నా అతివేగంగా నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురిచేశాడు. గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్‌రె ఆపి, డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు.






