26 April, 2026 | 8:14 AM

కళలను ప్రోత్సహించడమే లక్ష్యం

03-12-2024 01:40 AM

కరీంనగర్ మేయర్ సునీల్‌రావు

కళాభారతి పనుల పరిశీలన

కరీంనగర్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని కళలను, కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని మేయర్ సునీల్‌రావు అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ పరిధిలోని కళాభారతి ఆధునీకరణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సునీల్‌రావు మాట్లాడుతూ.. కళాభారతిని ఆధునీకరించి పూర్వవైభవం తీసుకు వస్తామని అన్నారు.

పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే పూర్తి చేసి డిసెంబర్ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించాలని కోరారు. కళాభారతిలో ఆధునిక పద్ధతిలో స్టేజీ నిర్మాణం, 400 సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టం తదితర సౌకర్యాలు ఉన్నట్టు తెలిపారకు. జిల్లాలోని కవులు, కళాకారులు, గేయ రచయితలు, గాయకులు, నాటకరంగ కళాకారులు, చలనచిత్ర జూనియర్ ఆర్టిస్టులు వినియోగించుకునేలా కళాభారతిని పూర్తిస్థాయిలో ఆధునీకరించామని చెప్పారు. ఆయనవెంట నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రొడ్డ యాదగిరి ఉన్నారు.