11-11-2025 10:16:52 PM
సిద్దిపేట క్రైమ్: ఒంటరిగా ఉన్న ఓ మహిళ ఇంటి ముందు సోమవారం అర్ధరాత్రి అనుచితంగా ప్రవర్తించిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు సిద్దిపేట టూ టౌన్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. నర్సాపూర్ గ్రామానికి చెందిన బొల్లమైన రాకేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటి నుంచి బయటకు రాకుండా గడియ పెట్టాడు. కరెంటు సరఫరాను తొలగించాడు. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు. ఈ విషయమై సదరు మహిళ మంగళవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచారు.