03-10-2025 06:49:29 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో గురువారం దసరా ఉత్సవాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ వార్డులలో, బస్తీలలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించారు. పలు ఆలయాలు భక్తులతో రద్దీగా దర్శనమిచ్చాయి. షమీ పూజ అనంతరం దేవాలయాలు, దుర్గామాత మండపాలలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు జరిపి పట్టణంలో కన్నుల పండుగగా రథోత్సవాన్ని నిర్వహించారు. బెల్లంపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ జమ్మి చెట్టుకు షమీ పూజ నిర్వహించారు.హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి తిలక్ క్రీడా మైదానంలో అశేష జన వాహిని మధ్య రావణాసుర వద కార్యక్రమాన్ని చేపట్టారు.