calender_icon.png 4 October, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

04-10-2025 12:00:00 AM

-పలుచోట్ల రావణ దహన కార్యక్రమం 

-దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు 

కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): విజయదశమి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఉదయమే తలంటు స్నానాలు ఆచరించిన జిల్లా ప్రజలు దసరా వేడుకల లో పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బాన్సువాడలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొని రావణ దహన కార్యక్రమానికి వీక్షించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన సతీమణి అర్చనతో కలిసి జంబి పూజ నిర్వహించారు.

అనంతరం బిచ్కుందలో రావణ దహనన  కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం జనగామలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుభాష్ రెడ్డి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో వివిధ పార్టీల నాయకులు దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. జంబి తీసుకునే ప్రాంతంలో విద్యుత్ లైట్లు వెలిగకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురి పర్సులను దొంగలు ఇదే అదనుగా భావించి కొట్టేశారు. జిల్లా వ్యాప్తంగా రహన దహన కార్యక్రమాలను పలుచోట్ల నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

తాడ్వాయిలో.. 

తాడ్వాయి, అక్టోబర్, 3( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని సంతాయిపేట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో, తాడువాయి లోని శ్రీ శబరిమాత ఆలయంలో, కృష్ణాజివాడి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, ఎర్ర పహాడ్ లోని ఎల్లమ్మ దేవి ఆలయంలో,నందివాడలోని బసవన్న దేవాలయంలో భక్తులు పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దసరా పండుగ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు కలిసి దసరా వేడుకలు నిర్వహించారు ఒకరికొకరు బంగారం పెట్టుకొని కౌగిలించుకొని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ పండుగ నుంచి చెడును వదిలి మంచి కోసం కృషి చేయాలని ఒకరికొకరు తెలుపుకున్నారు దసరా పండుగ తో విజయాలే రావాలని భగవంతున్ని ప్రార్థించారు రాత్రి వేళలో జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి..

బాన్సువాడ అక్టోబర్ 3 (విజయ క్రాంతి): చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ జరుపుకుంటారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పేర్కొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన ‘రావణదహన‘ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,  పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు,మాజీ ౄCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి లు ప్రజలతో కలిసి వీక్షించారు.

వరుసగా 15 సంవత్సరం మాజీ ౄCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆద్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణదహన  కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అనంతరం స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి ఆకును పంచుతూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.