calender_icon.png 4 October, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన ప్రభుత్వంలో పండుగ పూట పస్తులా

04-10-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ప్రజా ప్రభుత్వం అను చెప్పుకొచ్చే కాంగ్రెస్ ప్రజాపాలనలో  కార్మికులు పస్తులుండె పరిస్థితి రావడం నిజంగా సిగ్గు చేటని సిఐటియూ ఉపాధ్యక్షుడు  వెలిశాల కృష్ణమాచారి అన్నారు. కలెక్టరేట్ ఎదుట గిరిజన హాస్టల్స్ డైలీ వేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్లు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరింది. ఆకలితో అలమటిస్తున్నామన్న  సంకేతం వచ్చేలా  ఖాళీ ప్లేట్లతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ కడుపు కట్టునుని కూలి చేసిన కార్మికుల పొట్ట కొట్టి పండగ పూట పస్తులు ఉంచడం నిజంగా దేశంలో ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

7 నెలలుగా వేతనాలు రాక పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని ప్రభు త్వం స్పందించి సమస్యలు పరిశీలించాలని  కోరారు.సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సిఐటియు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన ఆశ్ర మ పాఠశాలలో హాస్టల్స్ డైలీ వేజ్ మరియు ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటియు రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు తొడసం వసంతరావు, ఉపాధ్యక్షులు అరిగేల కోట య్య కమల శశికళ పుష్ప మామిడి లక్ష్మి మాన్కు శంకర్ తిరుపతి, సదాశివ్ హీరాభాయి ఇందు రమేష్ శివరాం యమునా, నాయకులు లత తెలంగ్రావు, తదితరులు పాల్గొన్నారు.