04-10-2025 12:00:00 AM
కుమ్రం భీం ’ఆసిఫాబాద్,అక్టోబర్3 (విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల సాధనలో మహనీయుల స్పూర్తితో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఈ నెల 7 న జోడేఘాట్‌లో జరగనున్న ఆదివాసీ వీరులు కొమురం భీం, కొమురం సూరు ల వర్ధంతికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ నాయకులతో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయులు చూపిన బాటలో నడుస్తూ హక్కు ల సాధనకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుంరం సొనేరావు, కుంరం లాల్ సావ్, ఉత్సవ కమిటీ చైర్మన్ పెందొర్ మొతిరం, మాజీ ఎంపీపీ తొడసం జగన్నాథ్,కమిటీ సభ్యులు భుత బాపురావు, మడవి రాజు, సూరు కమిటీ చైర్మన్ కుంరం మారుతీ,కన్వీనర్ సిడం ద్రము తదితరులు పాల్గొన్నారు.