calender_icon.png 26 September, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ప్రయాణికులకు దసరా బహుమతులు

25-09-2025 11:39:32 PM

- హయత్ నగర్ డిపో మేనేజర్ విజయ్ 

- ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని పిలుపు 

ఎల్బీనగర్:  దసరా పండుగ సందర్బంగా ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ బహుమతులు అందజేస్తుందని హయత్ నగర్ డిపో - 1 మేనేజర్ విజయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులకు 'లక్కీ డ్రా' కార్యక్రమం ద్వారా బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు.‌ ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు తమ టికెట్ పై పేరు, ఫోన్ నెంబర్ రాసి లక్కీ డీప్ బాక్స్ లో వేయాలని సూచించారు.

అందులో భాగంగా హయత్ నగర్ బస్టాండ్ లో లక్కీ డ్రా బాక్స్ ఏర్పాటు చేశామని వివరించారు. లక్కీ డ్రా లో మొదటి బహుమతి రూ, 25వేలు, రెండో బహుమతి  రూ,15వేలు, మూడో బహుమతి రూ, 10వేల నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు. లక్కీ డ్రా అక్టోబర్ 8 న రీజినల్ స్థాయిలో అధికారుల సమక్షంలో డ్రా తీస్తామని వివరించారు.