26-09-2025 12:41:42 AM
తీవ్రంగా ఖండిస్తున్న యాత్రికులు స్థానికులు
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి స్నానాలు ఘాటు వద్ద పవిత్ర స్నానాలు కుటుంబాలతో సహా ఆచరిస్తారు. అదే సమయంలో కొందరు పెద్దలకు గోదావరి నది తీరంలో పిండ ప్రధానం చేస్తారు. అయితే అక్కడ విక్రయించే పూజా సామాగ్రిని ఒక యువకుడు అత్యధిక రేట్లకు అమ్ముతుండటంతో, ఇష్టానుసారంగా అధిక రేట్లు అమ్ముతున్నారని ఒక భక్తుడు ప్రశ్నించగా గురువారం ఉదయం ఆగ్రహించిన స్థానిక యువకుడు, భక్తుడి పై, ఇష్టానుసారంగా బూతులు తిట్టి, ఆపై దాడికి పాల్పడ్డాడు.
దాడిలో భక్తుడు తలకి గాయం కాగా, తలకు రక్తం వస్తుండడంతో యాత్రికుల కుటుంబం భయ భ్రాంతులకు గురైంది. దాడి చేసిన వ్యక్తి కరకట్ట వద్ద పిండ ప్రధాన సామాగ్రిలు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో యువకుడు మద్యం సేవించి ఉన్నాడని, దాడికి గురైన కుటుంబం తెలిపారు. దాడి చేసిన యువకుడు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుదూర ప్రాంతాల నుండి రామ దర్శనం కోసం వచ్చిన భక్తులపై దాడి చేయటాన్ని పలువురు యాత్రికులు స్థానికులు తీవ్రంగా ఖండించారు. వెంటనే స్థానిక దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తగు చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావతం కాకుండా చూడాలని కోరుతున్నారు.