26-09-2025 12:33:39 AM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, సాగు తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువును పరిశీలించి పరవళ్ళు తోక్కుతున్న కృష్ణమ్మకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూజలు నిర్వహించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 15 ఎండ్ల నుండి ఎడారినీ తలపించిన నార్కెట్‌పల్లి చెరువుకు నేడు జలకళ రావడం తో రైతన్న లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చెరువు అలుగు దూకుతుండగా బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని రైతన్న లు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వేముల వీరేశం కు కృతజ్ఞతలు తెలియజేశారు.