calender_icon.png 26 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు గ్రూప్-1 అభ్యర్థులకు నియామకపత్రాలు

26-09-2025 12:26:37 AM

  1. శిల్పకళా వేదికగా అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  2. మంత్రులందరికీ ప్రత్యేక ఆహ్వానం
  3. సీఎస్ రామకృష్ణారావు వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాం తి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా గ్రూప్-1 సర్వీస్‌కు ఎంపికైన వారికి శనివారం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి నియామకపత్రాలు అందించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ర్యాంకర్లు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందుకోనున్నట్టు గురువారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు వెల్లడించారు.

శిల్పకళా వేదికలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ అర్డ ర్లు అందిస్తారని సీఎస్ తెలిపారు. దాదాపు 18 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రు లందర్ని ఆహ్వానిస్తున్నట్టు సీఎస్ వెల్లడించారు.

ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం కూడా శుక్రవారం నాడు పూర్తిచేయా లని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఒక్కొక్క అభ్యర్థికి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యులను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ని యామకాల్లో అత్యధికంగా రెవెన్యూ, హోం, పంచాయతీరాజ్ శాఖలకు చెందినవారే ఉ న్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.

ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యద్శులు సవ్యసాచి ఘోష్, వికాస్‌రాజ్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, ముఖ్య కార్యదర్శులు బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా, సందీప్‌కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేశ్‌కుమార్, టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.