26-09-2025 01:02:13 AM
21 అంశాలతో పనుల గుర్తింపు ప్రక్రియ
పల్లెల్లో వసతుల మెరుగుకు అవకాశం
సంగారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) :గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల క ల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించింది. ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 613 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు సర్వే చేపట్టారు. గ్రామ పంచాయతీ భవనంతో సహా ప్రభుత్వ ఆస్తుల వివరాలతో పాటు ప్రజలకు కల్పించాల్సిన వసతుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి.
21 అంశాలతో ప్లానింగ్..
ఈ సర్వేలో 21 అంశాలకు సంబంధించి న సమగ్ర మౌలిక వసతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇదివరకే పంచాయతీ కార్యద ర్శులు వినియోగిస్తున్నజీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించి సర్వేకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు. కార్యదర్శులు గ్రామ పంచాయతీ భవనంతో సహా అంగన్వాడీ కేంద్రం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్. సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, ప్రభుత్వ పాఠశాల, వైకుంఠధామం, సామాజిక ఇంకుడు గుం తలు, వ్యక్తిగత మరుగుదొడ్లు,
ఆరోగ్య కేం ద్రాలు, పల్లె ప్రకృతి వనం, సీసీ రహదారులు, అనుబంధ గ్రామాల రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, వరద, మురుగు కాల్వలు, తా గునీరు, వీధి దీపాలు, పశువుల నీటితొట్లు, గ్రంథాలయాల తదితర వాటిని పరిశీలించి అందులో ఉన్న వసతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేతో పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో ఎలాంటి వసతులున్నా యి.. సమస్యలు ఏంటి ప్రజల అవసరాలు, కల్పించాల్సిన వసతులు ఏంటనే లెక్క తేలుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
జీపీఐడీపీ యాప్ ప్రత్యేకత..
గ్రామాల్లో మౌలిక వసతులను తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. జీపీఐడీపీ (గ్రామ పంచాయతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్) యాప్లో పంచాయతీ కార్యదర్శులు తమ డీఎస్‌ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్టు)తో పాటు ఈ యాప్ పాందుపర్చిన 21 అంశాల్లో మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాలి.
అయితే మౌలిక వసతులు కల్పించే సంవత్సరం, కావాల్సిన నిధులు, ఎక్కడి నుంచి నిధులు తీసుకోవాలనే వివరాలు యాప్లోనే ఉంటాయి. నమోదు చేయగానే ఆ వివరాలు క్యాప్చర్ అవుతాయి. ఇలాంటి ప్రత్యేక యాప్ ద్వారా పక్కా ప్రణాళిక రూపొందించనున్నారు.
పక్కా ప్రణాళిక..
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే చేపట్టాం. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇంకా చేపట్టాల్సిన పనులు, అందులో అత్యంత ఆవశ్యకత కలిగిన వాటిని నమోదు చేస్తున్నాం. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు అవసరం ఉందో తక్షణం తెలియనుంది. అన్ని గ్రామాల్లో వసతులు మెరుగుపడనున్నాయి.
సాయిబాబా, డీపీఓ, సంగారెడ్డి జిల్లా