26-09-2025 12:00:00 AM
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గురువారం ఉదయం 8 గంటలకు ‘ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాథ్‘ అనే నినాదంతో స్వచ్ఛతా అభియాన్‌ణు నిర్వహించింది. ఈ కార్యక్రమం లో జోనల్ హెడ్ ధరాసింగ్ నాయక్ కె, రీజనల్ హెడ్ దిలీప్ బరన్వాల్, జోనల్ ఆఫీస్ మరి యు రీజనల్ ఆఫీస్ కార్యనిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్వచ్ఛ అభియాన్ 5.0 అన్ని శాఖలు, కార్యాలయాలలో వచ్చే నెల 2వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. స్వచ్ఛతను సంస్థాగతం చేయడం కోసం స్వచ్ఛోత్సవ్ కింద ప్రత్యేక ప్రచారం 5.0 ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపడుతున్నారు.