calender_icon.png 26 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ రాష్ట్ర దొంగల ముఠాపై పిడి యాక్ట్

26-09-2025 12:27:35 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగలు పలుచోరీలకు పాల్పడడంతో పాటు సమాజానికి విఘాతం కలిగిస్తున్న వారిని గుర్తించి పిడి యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం కామారెడ్డి జిల్లాలో చోరీలకు పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా కు చెందిన ముగ్గురికి నిజాంబాద్ జైల్లో కామారెడ్డి పోలీస్ పిడి యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుసగా చోరీలకు పాల్పడుతూ నేరపూరితంగా వ్యవహరిస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ తెలిపారు.

44వ జాతీయ రహదారిపై చోరీలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేసిన అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసింది. ముగ్గురు అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. వరుసగా కామారెడ్డి, నిజాంబాద్, నిర్మల్ జిల్లాలో రహదారులపై వెళ్తున్న వాహనదారులపై దాడులు నిర్వహిస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అంతరాష్ట్ర దొంగలపై పిడి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. పిడి యాక్ట్ నమోదు చేయడం వల్ల ఏడాది పాటు జైల్లోనే జీవితం గడపాల్సి వస్తుందని తెలిపారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వారికి పిడి యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.