calender_icon.png 26 September, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గులాబీ గూటికి కోనేరు బ్రదర్స్

26-09-2025 12:37:21 AM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన సోదరుడు మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గులాబీ గూటికి చేరుకున్నారు. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప పాలయ్యాడు. ఎన్నికల అనంతరం బీఎస్పీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ చేరడంతో ఆయన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నారని అలక చెంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరడంతో కోనప్ప కాంగ్రెస్ నాయకులపై బహిరంగానే విమర్శలు సందించారు.స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్లిన ఆయన గురువారం హైదరాబాదులో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో కోనేరు బ్రదర్స్ గులాబీ కండువాను కప్పుకున్నారు.