calender_icon.png 26 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

26-09-2025 12:47:26 AM

ఉత్సవ కమిటీ సభ్యులకు సన్మానం

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అక్టోబర్ 7వ తేదీన ఆదివాసీల ఆరాధ్య దైవం జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అసువులు బాసిన కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా వేడుకల నిర్వాహణ ఉత్సవ కమిటీని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవలక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. వర్ధంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు వెళ్లి వర్ధంతి వేడుకలను జయప్రదం చేయాలని తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు.