04-10-2025 12:56:57 AM
అశ్వాపురం, అక్టోబర్ 3,(విజయక్రాంతి):మండల వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా గురువారం జమ్మి పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించ బడ్డాయి. ప్రతి గ్రామంలో భక్తులు ఉదయం నుంచే కొత్త బట్టలు ధరించి జమ్మి చెట్ల వద్ద చేరి పూజలు చేశారు. మహిళలు, పురుషులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని జమ్మి ఆకులను బంగారం లా భావించి ఒకరికి ఒకరు పంచుకున్నారు. పూజారులు మంత్రోచ్చారణలతో జమ్మి చెట్లను అలంకరించి శాస్త్రోక్తంగా పూ జలు జరిపారు.
పెద్దలు పిల్లలకు జమ్మి ఆకులు ఇస్తూ సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి అని ఆశీర్వదించారు. మండలంలోని అశ్వాపురం, మొండికుంట,మల్లెల మడుగు ,రామచంద్రాపురం, తదితర గ్రామాల్లో జమ్మి పూజలు ఉత్సాహంగా జరిగాయి. యువకులు బండ్లపై ఊరేగింపులు నిర్వహించి జమ్మి ఆకులు పంచగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని పూజలు చే శారు. జమ్మి పూజలతో గ్రామాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకొని విజయదశమి సం బరాలు మరింత విశేషంగా మారాయి.
ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ జమ్మి పూజ అనేది విజయదశమి ఉత్సవాల్లో ప్రధానమైనది. ఇది ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక. ప్రతి ఇంటిలోనూ బంగారం సమృద్ధిగా నిలవాలని, అన్నీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆ కాంక్షిస్తాం అని పేర్కొన్నారు. మొత్తం మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు, జమ్మి పూజలతో సర్వత్రా పండుగ హర్షం నెలకొంది. చిన్నా, పెద్దా అందరూ ఉత్సాహంగా పాల్గొని విజయదశమి సంబరాలను మరింత విశేషంగా మార్చారు.