calender_icon.png 4 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు తెచ్చిన తంటా

04-10-2025 12:52:45 AM

  1. కీలక నేతలకు రిజర్వేషన్ల జులక్ 
  2. జెడ్పిటిసి సీటును ఆశించిన ఎన్పి వెంకటేష్ 
  3. ఎంపీపీ సీటు ఆశించిన మరో నేత బుద్ధారం సుధాకర్ రెడ్డి 
  4. రిజర్వేషన్ల తో బరిలో నిలిచేందుకు లేని అవకాశం 
  5. బరిలో మేము లేకుంటే మాకెందుకు ఆ పోటీ?
  6. కీలక నేతలు అసలు పార్టీలో కొనసాగుతారా? లేదా?

మహబూబ్ నగర్, అక్టోబర్ 3(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలలో భాగం గా విచ్చేసిన రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలకు తలనొప్పి తీసుకువచ్చింది అంటూ కాంగ్రెస్ నేతలే చెబుతున్న మాట. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాం గ్రెస్ పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేసిన వారిలో పలువురు కీలక నేతలు ఉన్నారు. వారిలో ఎంపీ వెంకటేష్, బుద్ధారం సుధాక ర్ రెడ్డి తమదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని గె లుపు వైపుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేసిన విషయం విధితమే.

అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక కీలక పదవి అ ప్పజెప్పకుండా ఉంటుందా? ఇన్నాళ్ళ నిరీక్షణకు స్థిరపడదా? అనే ప్రశ్నకు సమాధానాలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీసుకుం టూ వచ్చిండ్రు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచనలు సలహాలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలుస్తూ వస్తున్నారు. జిల్లా స్థాయిలోనూ, మండల పరిధి లోని కీలక బాధ్యతలను చేపట్టి వారికి ఉన్న సమయంలో చెరగని ముద్ర వేసుకుందామ నే ఆలోచనతో అడుగులు వేసిండ్రు.

ఎందు కు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకొని ఎవరికి వారు వారి ధీమాను వ్యక్తం చేసుకుంటూ కీలక పోస్టులను ఊహించుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ రావడంతో పా టు రిజర్వేషన్లు బహిర్గతం కావడంతో వారి ఆశలు ఆశించిన స్థాయికి చేరుకోవడం లేద ని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఇక ఉన్న సమయం అంతా పార్టీ సేవకే ఉపయోగిస్తా రా? మరి ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనే సందేహం ప్రత్యేక చర్చకు దారితీస్తుంది.

అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి..

మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఎ న్పీ వెంకటేష్ హన్వాడ మండలం జెడ్పిటిసి బరిలో నిల్చెందుకు గత ఎనిమిది మాసాల నుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటూ మండలంలోని దాదాపు అన్ని గ్రా మాల పరిధిలో సమావేశాలు ఏర్పాటు చేసి కీలక నేతలను ఏకతాటి పైకి తీసుకువచ్చేందుకు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి తో కలిసి ఎన్పీ వెంకటేష్ జెడ్పిటిసి బరిలో నేనుంటున్నాను.. జెడ్పి చైర్మన్ దక్కించుకుంటాను అనే అంశాన్ని కూడా హన్వాడ మం డలంలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో స మావేశాలు జరిగాయని కీలక నేతలు చెబుతున్న మాట.

కాగా హన్వాడ మండలం జడ్పి టిసి బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో ఒ క్కసారి వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో హన్వాడ మండలం జెడ్పిటిసి బరిలో ఎవరు ఉంటారనే సందేహం కార్యకర్తల్లో ఓకులకి రావడంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీపీ బాధ్యతలోనైనా ఉండేందుకు హన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన బుద్ధారం సుధాకర్ రెడ్డి కి సైతం ఎంపీపీ బీసీ మహిళ రిజర్వుడ్ కావడంతో ఇరువురి ఆశించిన రిజర్వేషన్ రాకపో వడంతో ఆసక్తి చూపడం లేదని చర్చ తీవ్ర రూపం దాల్చింది.

దీంతో ఒక్కసారిగా హన్వాడ మండలంలో కాంగ్రెస్ నేతల్లో అస లు జెడ్పిటిసి, ఎంపీపీ బరిలో ఉండేందుకు నేతలు ఎవరు గుర్తించడం కష్టంగానే ఉంద ని అన్వాడ మండలం కాంగ్రెస్ నేతల్లో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా రిజర్వేషన్లు ఆయా గ్రామా ల కీలక నేతలకు ఆశించినట్లు రాకపోవడం తో రిజర్వేషన్లు తెచ్చిన తంట కీలక నేతలతో పాటు ఎవరిని ఎటువైపు తీసుకువెళ్తాయో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. 

ఉన్నంతకాలం సేవలోనేనా..?

 పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించిన నేతల కు రిజర్వేషన్లు జులక్ ఇవ్వడంతో కీలక నే తలు అసలు పార్టీలో కొనసాగుతారా మరేమైన నిర్ణయం తీసుకుంటారనే సందేహం కూడా వస్తుందని పలువురు చర్చించుకుం టూ ఉండ్రు. మరింతకాలంలో జిల్లా స్థాయి లో ఆశించిన పోస్టులు దక్కే పరిస్థితులు అ నుమానాలు ఉండడంతో కీలక నేతలు అస లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి అవకాశం ఉందా? మరి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే సందేహం కూడా వస్తుందని పా ర్టీలో పలువురు ప్రత్యేకంగా చర్చిస్తున్రు.

కాం గ్రెస్ పార్టీ మాత్రం సీనియర్లకు ప్రత్యేక ప్రా ధాన్యత ఉంటుంది అంటూ చర్చను తీసుకువస్తుంది. దీంతో ఆశించిన మేరకు రిజర్వేష న్లు రాకపోయినప్పటికీ పార్టీ కీలక బాధ్యతలను అప్పజెబుతోందని పలువురు నేతలు ఆశిస్తున్రు. మరి కొంత సమయంలో ఎవరి దారి ఎటువైపు ఉంటుందో తెలిసే అవకాశా లు మెండుగా ఉంటున్నాయని పార్టీ వర్గాలు ప్రత్యేకంగా చెబుతున్న మాట.