calender_icon.png 5 July, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం కోసమే డ్యూటీ మీట్

05-07-2025 12:00:00 AM

మల్టీ జోన్ 2 డిఐజి ఎల్‌ఎస్ చౌహన్

నాగర్ కర్నూల్ జులై 4 విజయక్రాంతి ): పోలీస్ అధికారుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవ డం కోసమే డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగిందని గద్వాల మల్టీ జో న్-2 డిఐజి ఎల్ ఎస్ చౌహన్ అన్నా రు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన డ్యూ టీ మార్ట్ కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, నారాయణపేట్, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని సుమారు 150 మంది పోలీస్ సిబ్బందికి 24 అంశాల్లో మృతి నైపుణ్యాలు పెం పొందించుకునే విధంగా పోటీలు నిర్వహించి 72 మందికి ఆయా విభాగాల్లో విజేతలుగా ప్రకటించి బహుమతులు షీల్ ప్రశంసా పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

మల్టీ జోన్ పరిధిలో విజేతలుగా గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయిలో రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి జాతీయస్థా యి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు అందులో విజేతలుగా గెలుపొందిన వారికి ఇంక్రిమెంట్లు, క్యాష్ ప్రైస్ మెమొంటోళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు జిల్లా ఎస్పీ గైక్వా డ్ వైభవ్ రఘునాథ్, మహబూబ్నగర్ ఎస్పీ డి జానకి, నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌత మ్, వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్, అదనపు ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ పోలీస్ సిబ్బందిఉన్నారు.