calender_icon.png 2 August, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండ్లిపాకల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలి

31-07-2025 08:00:09 PM

బిఆర్ఎస్ పార్టీ కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్

దేవరకొండ: పెండ్లిపాకల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు రమావత్ దాస్రు నాయక్ అధికారులను కోరారు. గురువారం నీటిపారుదల శాఖ అధికారులకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పెండ్లిపాకుల రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి ఆయన కోరారు.

పెండ్లిపాకుల రిజర్వాయర్ క్రింద పెండ్లిపాకల, చింతకుంట్ల, చెన్నంనేనిపల్లి, రమావత్ తండా, ఫకీర్ పురం, దేశ్ మూకీకుంట, పిల్య తండా, వర్ధమనిగూడెం, అచ్చంపేట పట్టి, సింగ్య తండా గ్రామాల రైతు తూకం పోసుకొని నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్. లేనిచో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని అయన హెచ్చరించారు.